గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, సమాజం, సహచరుల నుంచి రకరకాల ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటితోపాటు ఆర్థిక సమస్యలు ఉండనే ఉంటాయి. కాబట్టి అన్నింటిని తట్టుకునే సహనం, మానసిక సంసిద్ధతతోపాటు అవసరమైన ఆర్థిక వనరులు ముందే ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయాలి.