నిజజీవితంలో మనం విజయం వస్తే ఒక విధంగా ఓటమి పాలయితే మరో విధంగా ప్రవర్తించడం సాధారణంగా జరిగేదే. వరుసగా కొన్ని ఫెయిల్యూర్స్ వస్తే వింతగా ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొత్త ప్రయత్నాలు చేయాలని అనుకున్నా గతంలో ఓడిపోయామనే భావన మనసులో ఉండటంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయడం కూడా ఆపేస్తూ ఉంటాం. మనలో ఎంతోమంది ప్రయత్నించినా విజయం దక్కదనే భావనతో జీవిస్తూ ఉంటారు. 
 
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఓటమి అనేది సర్వసాధారణం. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ప్రతిసారి ఫెయిల్ అవుతామని భావించకూడదు. జీవితంలో వైఫల్యం కూడా ఒక భాగం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనలో ఉన్న పోరాట పటిమను ఎప్పుడూ వదులుకోకూడదు. ప్రయత్నిస్తే ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది. చేసిన కృషికి తప్పకుండా ఫలితం ఉంటుంది. 
 
అలుపెరుగని పోరాటపటిమతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవచ్చు. పోరాట పటిమ సన్నగిల్లితే విజయానికి ఆమడ దూరంలోనే ఆగిపోవాల్సి వస్తుంది. పోరాట పటిమ లేకపోతే చెప్పుకోదగ్గ విజయాన్ని సొంతం చేసుకోవడం అసాధ్యం. పోరాట పటిమ ఉన్నత స్థానాలకు చేర్చడంతో పాటు గొప్పవారిని చేస్తుంది. పోరాట పటిమను అలవరచుకుని కష్టపడితే కెరీర్ లో విజయం సాధించడం కష్టమేమీ కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: