మహిళలకు రక్షణ కల్పించాలని ... కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలను అమలు చేయాలని అనుకుంటారు..కానీ దానికి పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత ఎంతైనా పోలీసు వారికి ఉంది. దుష్టుల నుండి కాపాడాల్సిన అవసరం రక్షక భటులు గా వారే తీసుకోవాలి.. కానీ వాళ్లే మహిళలపై అగయిత్యలు చేస్తే ఇంకా ఆడవాళ్ళను ఎవరు రక్షిస్తారు.. బాధ్యత కల వృత్తిలో ఉన్న వాళ్ళే కామందులుగా మారితే మహిళలను ఎవరు కాపాడుతారు.. దిశ లాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త ఎవరు చూస్తారు.. 

 

 

వివరాల్లోకి వెళితే.. పోలీస్ స్టేషన్ లో మహిళ కానిస్టేబుల్ కు రక్షణ లేకుండా పోయిందట..పోలీస్ కానిస్టేబుల్ కీచకుడిగా మారాడు. మహిళా కానిస్టేబుల్ మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. మహిళా కానిస్టేబుల్.. నిందితుడైన కానిస్టేబుల్ ఒకే పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. అది కూడా ఓ మహిళా పోలీస్ స్టేషన్‌లో కావడం గమనార్హం.

 

 

ఎందుకు చేశాడో వివరాల్లోకి వెళితే..మహిళా పోలీస్ స్టేషన్‌లోనే మహిళకు రక్షణ లేని దుస్థితి దాపురించించింది. హర్యానాలోని మనేసర్ జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సుమిత్ కుమార్ అదే స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఓ కేసులో సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ వాటిని భద్రంగా స్టేషన్‌లో దాచింది. పలు డాక్యుమెంట్లు, ధ్రువీకరణ పత్రాలతో సహా వీడియో సాక్ష్యాన్ని భద్రపరిచింది....

 

 

ఆ సాక్ష్యాలను దొంగలించిన తారుమారు చేశాడు..మహిళా ఉద్యోగిని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సీరియస్‌గా పరిగణించిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్ అరెస్టు చేశారు. తక్షణం కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు సిఫార్సు చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలను తొలగించారు.. ఐ పి అడ్రెస్స్ సహాయంతో ఆ వీడియోలు ఎక్కడ పోస్ట్ అయ్యాయి..అనే విషయాలను తెలుసుకొని వాటిని తొలగించారు.. ఈ విషయం పొక్కడంతో జనాలు చీ అని చీదరిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: