మ‌తిమ‌రుపు ఉన్న ఓ త‌ల్లి గురించి ఆమె ప‌డే ఆవేదన గురించి మ‌నం ఈ రోజు మ‌న అమ్మ శీర్షిక‌లో తెలుసుకుందాం. అందులో దాగి ఉన్న ఆ క‌న్నీటి బాద ఏమిట‌న్న‌ది చూద్దాం. త‌ల్లి బిడ్డ‌ల‌ను ఎంత జాగ్ర‌త్త‌గా కాపాడుతుందో తెలియ‌నిది కాదు. అయితే కొంత వ‌య‌సు మ‌ళ్ళిన త‌ర్వాత అదే త‌ల్లి బిడ్డ‌ల‌కు బ‌రువైపోతుంది. అందులోనూ భ‌ర్త దూర‌మైన ఆ త‌ల్లి ఒంట‌రిగా మిగిలిపోయి ఆమె ప‌డే మాన‌సిక క్షోభ అంతా ఇంతా కాదు. అందులోనూ బిడ్డ‌ల‌కు దూర‌మైన ఆ త‌ల్లి క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా ఎవ్వ‌రూ ఉండ‌రు. మ‌రి ఇలాంటి స్థితిని అనుభ‌వించే త‌ల్లులు ఎంతో మంది. 

 

ఒక‌వేళ కొడుకు ద‌గ్గ‌ర ఉంటే కోడులు స‌రిగా చూసి చూడ‌క కొంత మంది బాధ‌ప‌డెతుంటే. మ‌రి కొంత మంది. కొడుకు ఉన్న‌ప్పుడు ఒక‌లా ఉండి ఆ కొడుకు బ‌య‌ట‌కి వెళ్ళాక మ‌రోలా ఉండేవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక కూతిరి విష‌యానికి వస్తే పోనీ కూతురు ద‌గ్గ‌ర‌న్నా ఉందామ‌ను కుంటే అల్లుడు వారి అత్త‌వారింటివాళ్ళు ఏమనుకుంటారా అని అదొక‌ర‌క‌మైన బాధ ఇక త‌ల్లికి ఎక్క‌డ సుఖం ఉంటుంది. ఎక్క‌డ మాన‌సిక ఆరోగ్యం దొరుకుతుంది. మాట్లాడి మంచి చెడు తెలుసుకునే వారు కూడా లేకపోయేస‌రికి మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతారు కొంద‌రు. దాంతో కొంత వ‌య‌సు మీద ప‌డ‌గానే మ‌తిమ‌రుపుకు కూడా గుర‌వుతుంటారు. 

 

మ‌రి ఇలా ఒంట‌రిగా ఇబ్బంది ప‌డేవారు చాలా మందే ఉంటారు. అయితే వీరు ఎక్కువ శాతం ఏం చేయాలంటే చుట్టుప్ర‌క్క‌ల‌వారిని మంచి చేసుకోవాలి. వారితో క‌లిసిమెలిసి మంచి చెడుల‌ను పంచుకోవాలి. బిడ్డ‌లంద‌రూ దూరంగా ఉన్నా మ‌న‌కు క‌నీసం మాటసాయం అందించేవారైనా ఉంటారు.  అలాగే ఏదైనా దేవుడి ధ్యాస‌లో ప‌డిపోతే ఎక్కువ‌గా మాన‌సిక ఒత్తిడి అనేది ఉండదు. దాంతో మ‌న‌కు టైం కూడా తెలియ‌ద. ఎప్పుడు టైం అయిపోతుందో కూడా తెలియ‌కుండానే అయిపోద్ది.

మరింత సమాచారం తెలుసుకోండి: