విజయశాంతి... లేడీ సూపర్ స్టార్ గా తన కంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మహిళ. తెలుగు సినిమాల్లో విజయశాంతికి ఒక ప్రత్యేక స్థానం. రాజకీయంగా కూడా ఆమె సత్తా చాటారు. తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు విజయశాంతి. ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా సరే ఆమెకు ఉండే గుర్తింపు ప్రత్యేకం. వరుసగా సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలో క్రేజ్ సంపాదించుకున్నారు. లేడీ ఓరియే౦టెడ్ సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ అయ్యారు. 

 

అయితే ఆమె రాజకీయాల్లో కూడా రాణించారు. 98లోనే బిజెపిలో అడుగు పెట్టి మహిళా మార్చాలో పని చేసారు. ఆమె తన ప్రసంగాలతో యువతను అప్పట్లో ఎక్కువగా ఆకట్టుకునే వారు. అయితే తెలంగాణా మీద ఉన్న ప్రేమతో కెసిఆర్ సమక్షంలో తెలంగాణా రాష్ట్ర సమితిలో జాయిన్ అయ్యారు. మెదక్ ఎంపీ గా ఆమె తన సేవలు అందించారు. పార్లమెంట్ లో తెలంగాణా వాణి వినిపించిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఆమె ప్రతిభను మెచ్చిన కెసిఆర్ పార్టీలో కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. 

 

అయితే ఆ తర్వాత కెసిఆర్ కి దూరమైన ఆమె తెరాస కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లో ఇప్పుడు కీలక నేతగా ఉన్న ఆమె... రాజకీయాల్లో కాస్త దూకుడు తగ్గించారు. అయితే త్వరలోనే తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే లో చేరే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి మాట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె మాత్రం రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. తెరాస లో ఉన్న సమయంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పార్లమెంట్ లో తన ప్రసంగాలతో విజయశాంతి ఎక్కువగా ఆకట్టుకునే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: