"అమ్మ ప్రేమ” ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే ఎందుకంటే  తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటి లేదు కాబట్టి. మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే “అమ్మ”.శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే “అమ్మా”.అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ? కొలిస్తే నే పలికేది ఆ దేవుడు…కాని పిలవకుండానే పలికేది “అమ్మ మనసు” మాత్రమే.

 

 


కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూనే ఉండవచ్చు అదే “అమ్మ ప్రేమ”. మనకు "ప్రాణం” అనే పదం చాలా చిన్నది అమ్మ ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.పిల్లల దగ్గర నుండి ప్రేమ తప్ప డబ్బు, నగలు, ఆస్తులు ఆశించని ఒకే ఒక్కరు మన అమ్మ. మనం ఎంత ద్వేషించిన, తిట్టిన, చీదరించుకున్న  గాని మన మీద ప్రేమని కురిపిస్తుంది. మన భాధని తన బాధగా భరిస్తుంది. సహనానికి మరో పేరే అమ్మ !అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువని మారింత పెంచండి.కొంత వయస్సు వచ్చిన తరువాత, ప్రతివారికీ, భార్య, భర్త, పిల్లలతో, సంసార భాద్యతలు యేర్పడతాయి. దానితో పాటే, వ్యక్తిగత ప్రేమలు, మమకారాలు వుంటాయి. అంతమాత్రాన వాటినుండి తల్లి, తండ్రిని దూరం చేయవలసిన అవసరం వుండదు.సంసారo, సహజ జీవితంతో  వ్యక్తిగతాన్ని సర్దుకుపోతూ వుండాలి!

 

 

 

ఆర్ధికంగా భద్రతతో పాటు, వాళ్ళనీ ఫ్యామిలీతోపాటే  వుండనిస్తే  వాళ్ళకు తృప్తిగ వుంటుంది. సాధారణంగా తమ పిల్లలు వ్యక్తిగత కుటుంబీకులైన తరువాత పుట్టిన పిల్లలు మీద  ప్రేమ కంటె, మనవడు, మనమరాలు మీద ప్రేమే మక్కువగా వుంటుంది. మనుమలు, మనునరాండ్లతో, ముచ్చటగా ఆడాలని, కబుర్లు చెప్పాలని ఉంటుంది వృద్ధులకు. అలాంటి ముచ్చటకి  వాళ్ళని దూరం చేయకూడదు.. అమ్మ మనకు ప్రాణం పోసిన దేవత.. మనకు నడక, నడవడిక నేర్పిన దేవత. అలాంటి దేవతని కంటతడి పెట్టించడం మంచిది కాదు... !

మరింత సమాచారం తెలుసుకోండి: