ఇక భారతీయ మార్కెట్లో ప్రముఖ టైర్ తయారీ సంస్థ 'జెకె టైర్స్' ఎలక్ట్రిక్ వాహనాల కోసం సరికొత్త టైర్లను ఆవిష్కరించడం జరిగింది.అలాగే కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త టైర్లను గురించి మరింత సమాచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..ఇంకా అలాగే దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో 'జెకె టైర్స్'  ఆధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈ టైర్లను ఆవిష్కరించింది.కావున ఎలక్ట్రిక్ బస్సులు ఇంకా అలాగే కార్లు మొదలైనవి ఈ టైర్లను ఉపయోగించుకోవచ్చు.ఇక ఈ ఆధునిక టైర్లను అత్యాధునిక గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ - 'రఘుపతి సింఘానియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (RPSCOE) లోని ఇంజనీర్లు రూపొందించడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఈ టైర్లు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.


అలాగే JK టైర్ ఎలక్ట్రిక్ వాహనాల  నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి అనుకూలంగా అభివృద్ధి చేయడమే కాకుండా.. అల్ట్రా-లో రోలింగ్ రెసిస్టెన్స్, తడి ఇంకా పొడి ప్రదేశాల్లో కూడా మంచి పనితీరుని అందించడానికి ఇవి చక్కగా సరిపోయే విధంగా ఉన్నాయి.ఈ లేటెస్ట్ టైర్లు E-ట్రక్కులు, E-బస్, E-LCV, E-PV, E-SUV ఇంకా E-టూ వీలర్స్ వాహనాల డిమాండ్ పనితీరు అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి.EV టైర్ రేంజ్ బస్సులు, ట్రక్కులు ఇంకా LCV ల అన్ని వర్గాల కోసం 17.5 ఇంచెస్ ఇంకా 22.5 ఇంచెస్ ట్యూబ్‌లెస్ పరిమాణాలలో అభివృద్ధి చేయబడింది.


ప్రస్తుతం, JBM E-బస్సులకు EV రేంజ్ టైర్లు అనేవి సరఫరా చేయబడుతున్నాయి. JK టైర్ & ఇండస్ట్రీస్ టెక్నికల్ డైరెక్టర్ VK మిశ్రా కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో ఈ టైర్లను ప్రదర్శించారు.ఇక ఈ JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలో అగ్రగామి టైర్ల తయారీ సంస్థ మాత్రమే కాదు, ప్రపంచంలోని టాప్ 25 తయారీదారులలో కూడా ఒకటిగా నిలిచింది. ఇంకా అలాగే దీనికి ప్రధాన కారణం వినియోగదారులు కంపెనీ ఉత్పత్తులపైన ఉంచుకున్న నమ్మకమే.

మరింత సమాచారం తెలుసుకోండి: