భారత దేశంలో వివిధ కార్ల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.. ముఖ్యంగా ఆకర్షనీయమైన మోడల్స్, అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్నాయి.. అలాంటి కంపెనీలలో బెంజ్, ఆడి, ఫోర్డ్, హోండా కంపెనీలు ఉన్నాయి.. ఈ కంపెనీలు ఉత్పత్తి చేసే కొన్ని ప్రత్యేక కార్లు ప్రజల మనసును దోచుకున్నాయి.. పండుగ సీజన్ లో ఇప్పుడు మరింత ఎక్కువగా కొత్త ఫీచర్లతో కార్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. తాజాగా హోండా కంపెనీ మరో కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేసింది.



ఈ కారులోని ప్రత్యేకతలు ,ఆకర్షనీయమైన హంగులు ఏంటో ఇప్పుడు చూద్దాం..హోండా సంస్థ తన సీఆర్-వీ మోడల్లో, సరికొత్త స్పెషల్ ఎడిషన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.29.50 లక్షలుగా సంస్థ  నిర్ణయించింది. ఈ కారులో అత్యాధునిక , సాంకేతిక నిపుణులు అంటున్నారు. ప్రజల అభిప్రాయాలకు తగ్గట్లు కంపెనీ హంగులు, ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేశారు.



ఎస్ యూవీలో యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లకు కొరతే లేదు. డ్రైవర్ అటెన్షన్ మానిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, లేన్ వాట్ కెమేరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఆటో హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఐ-ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు డ్రైవర్ తో పాటు ఫ్రంట్ ప్యాసెంజర్ కు కూడా భద్రత కొరకు ఏర్పాటు చేశారు..154 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 189 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. పవర్ ను ఫ్రంట్ వీల్స్ కు చేరవేస్తుంది.. పండగ సీజన్ లో కొంతవరకు మాత్రమే కార్లను మార్కెట్ లోకి వదులుతున్నారు.. ఇవే కాకుండా పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, రీమోట్ ఇంజిన్ స్టార్ట్ మొదలు ప్రత్యేకతలు ఉన్నాయి.. ఇంక ఆలస్యం ఎందుకు కారు ప్రియులు కొనేసేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: