ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు రోజుకో కారును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి.రోజుకో కారు షికారు చేస్తూ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కార్లు సేల్స్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రానున్న రోజుల్లో వీటికి ధరలు భారీగా పెరిగిపోతాయని మార్కెట్నిపుణులు అంటున్నారు. ఎందుకు ఆ లగ్జరీ కార్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 


ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రీమియం, లగ్జరీ కార్ల ధరలు రూ.35 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు పెరుగనున్నాయి. మేడ్ ఇన్ ఇండియా థీమ్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం విదేశాల నుంచి వివిధ వస్తువుల విడి భాగాల దిగుమతులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నులు పెంచారు.కార్లలో వినియోగించే విడి భాగాలపై 5 నుంచి 7.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతున్నట్లు ఇటీవల బడ్జెట్ లో వెల్లడించారు. 



ఇంజిన్‌కు సేఫ్టీ గ్లాస్‌, గేర్ కాంపొనెంట్స్‌, బ్రేక్‌లు, పెడల్స్‌లకు ఎలక్ట్రిక్ అండ్ వైరింగ్ భాగాలు తదితర విడి భాగాలపై ఈ సుంకం భారం పడనున్నది. ప్రత్యేకించి పూర్తిగా విదేశాల నుంచి విడి భాగాలపై ఆధారపడే ప్రీమియం, లగ్జరీ కార్ల  తయారీ దారులపై భారీగా పన్ను పడనుందని తెలుస్తుంది.దేశంలోకెల్లా అతిపెద్ద లగ్జరీ అండ్ ప్రీమియం కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో మార్టిన్ స్కూవెంక్ మాట్లాడుతూ పునరుద్ధరణ సమయంలో దిగుమతి సుంకాల పెంపును అసలు ఊహించలేదన్నారు. 



విడి భాగాలపై సుంకం భారం ఉత్పత్తిపై పడుతుందని అంతిమంగా కస్టమర్లపై అదనపు భారం పడుతుందని మార్టిన్ స్పష్టం చేశారు. అసలు విషయానికొస్తే.. గత నెలలోనే కార్లకు , వాటి తయారీ భాగాలపై భారీ పెంపును కంపెనీలు పెంచాయి. ఇప్పుడు మళ్లీ పెంచడం వల్ల ప్రజలు లగ్జరీ కార్లను కొనరు అనే సందేహాలు మొదలయ్యాయి.. మరి ఈ సమస్య పై ఆటో కంపెనీలు ఏ విధంగా అధిగమి స్తాయో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: