ఇక స్కోడా కంపెనీ నుంచి వచ్చిన ఆక్టేవియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇండియా మార్కెట్లో కొంత కాలం నుంచి చాలా విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. ఇక ఇప్పుడు ఈ కొత్త 2021 స్కోడా ఆక్టేవియా దాదాపు చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంది. ఇక ఈ 2021లో వస్తున్న న్యూ స్కోడా ఆక్టేవియా సన్‌రూఫ్‌తో రాదు.అంతే గాక దీనికి టాప్-ఆఫ్-ది-లైన్ ఎల్ ఇంకా కె వేరియంట్‌కు కూడా సన్‌రూఫ్ లభించదు.


ఇక ఈ కలర్స్ విషయానికి వస్తే, ఇందులో ఉన్న స్టైల్ వేరియంట్ మూడు కలర్స్ లో అందుబాటులో వుంది. అవి కాండీ వైట్, లావా బ్లూ ఇంకా మ్యాజిక్ బ్లాక్. ఇక అలాగే ఎల్ అండ్ కె వేరియంట్ ఐదు కలర్స్ లో లభిస్తుంది.ఇక ఇవి బ్రిలియంట్ సిల్వర్, మాపుల్ బ్రౌన్, కాండీ వైట్, లావా బ్లూ ఇంకా మ్యాజిక్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.


ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఆక్టేవియా ముందు ఇంకా వెనుక వైపు ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ డ్రైవర్ అలాగే ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగులు, కర్టెన్ ఎయిర్‌బ్యాగులతో మొత్తం ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇక అలాగే దీనితోపాటు ఎబిఎస్, ఇబిడి, పార్క్ అసిస్ట్, ఇబుజ్ ఫెటీగ్ అలర్ట్, మల్టీ-కొలిషన్ బ్రేక్ వంటి ఆకర్షించే కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి.


ఇక దీని రైడింగ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంటుంది.అంతేగాక ఈ కార్ మొత్తానికి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది.ఇక ఈ కార్ లో ఉన్న సస్పెన్షన్ సెటప్ మృదువైనది కాదు, కఠినమైనది కాదు.ఇక అలాగే ఈ కార్ నడిపే వాహనదారుడు అనుకూలమైన డ్రైవింగ్ అనుభూతిని అందించడానికి కంపెనీ ఈ విధంగా అప్డేట్ చేసి ఈ కార్ తయారు చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్ ధర అలాగే మిగతా విషయాలు ఈరోజు కంపెనీ వెల్లడించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: