ఇండియన్ మార్కెట్లో జర్మన్ ఫేమస్ లగ్జరీ కార్ తయారీ కంపెనీ 'మెర్సిడెస్ బెంజ్' ఇటీవల 'ఈక్యూఎస్ 580 4మ్యాటిక్' అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ ని విడుదల చేసింది.కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన రోజు నుంచే బుకింగ్స్  కూడా ప్రారంభించింది. అయితే బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే EQS 580 అద్భుతమైన బుకింగ్స్ సొంతం చేసుకుంది.ఇప్పటికే 300 బుకింగ్‌లను సొంతం చేసుకుంది.అయితే స్థానికంగా అసెంబుల్ చేయబడిన EQS 580 డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. అలాగే మరిన్ని కొత్త బుకింగ్లకు డెలివరీలు 2023 ప్రారంభంలో జరుగుతాయి.EQS 580 4Matic లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ధర రూ. 1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ సెడాన్ కొనుగోలు చేయాలనుకునే వారు ముందస్తుగా రూ. 25 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో మాక్సిమం 857 కిమీ రేంజ్ అందిస్తుండని ARAI ద్వారా వెరిఫై చేయబడింది.కంపెనీ ఇందులో 107.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ అందించింది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 523 హెచ్‌పి పవర్ ఇంకా 855 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 


ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 210 కిమీ వరకు ఉంటుంది.ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఈ బ్యాటరీ ప్యాక్ 200 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్‌ సాయంతో కేవలం 15 నిమిషాల్లో 300 కిమీ వెళ్ళడానికి కావాల్సిన ఛార్జింగ్ పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మూడు స్క్రీన్స్ చూడవచ్చు. ఇందులో కూడా డ్రైవర్ మరియు ప్యాసింజర్ ముందు ఉన్న స్క్రీన్స్ ఒక్కొక్కటి 12.3 ఇంచెస్ ఉంటుంది. అయితే మధ్యలో 17.7 ఇంచెస్ ఉంటుంది. ఇది టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.అంతే కాకుండా ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే, ముందు ప్రయాణికుల కోసం మసాజ్ ఫంక్షన్ సీట్లు, బర్మెస్టర్ 3D సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫిల్ట్రేషన్ మరియు వెనుక ఉండే ప్యాసింజర్ల కోసం MBUX టాబ్లెట్‌ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది చాలా అద్భుతమైన ఫీచర్స్ కలిగి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: