ఏపీ సీఎం జగన్ బాబాయ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడు గా ఉన్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గోవాలో సునీల్ యాదవ్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది. అయితే విచారణలో భాగంగా సునీల్ యాదవ్ ను ప్రశ్నించగా తనపై సీబీఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించింది అని.. తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించాడు.

అనంతరం ఇంటికి తాళం వేసుకుని కుటుంబం అజ్ఞాతం లోకివెళ్లి పోయింది. కాగా హత్యలో సునీల్ యాదవ్ పాత్ర కచ్చితంగా ఉందని భావిస్తున్న సిబిఐ గోవా కి వెళ్లి అతన్ని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఎం జగన్ కు స్వయానా బాబాయ్ వివేకా హత్య జరిగి రెండు సంవత్సరాలు పూర్తయినా ముఖ్యమంత్రి గా ఉన్నా జగన్ నిందితులను పట్టుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జగన్ ప్రోద్బలంతోనే వివేకా హత్య జరిగింది అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: