ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె సమీపంలో కలజువ్వలపాడులో ఓ వాహనం నుంచి జారి కింద పడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దోర్నాల నుండి ఒంగోలుకు మినీ ట్రక్‌లో వెళ్తుండగా మినీ ట్రక్‌ డోరు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ ఆరుగురిని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు పది మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. పొదిలి మండలం అక్కచెరువు గ్రామంలో ఓ పెళ్ళికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి మినీ ట్రక్ అనేది వస్తువులను రవాణా చేయడానికి మాత్రమే వాడాలి. కానీ రూల్స్ పాటించకుండా పెళ్ళికి వెళుతున్న వారిని ఎక్కించి పెళ్లింట విషాదానికి కారణం అయ్యారు. దీనికి వాళ్ళు ఎన్ని పెట్రోల్-డీజిల్ రేట్లు పెరిగాయి అని ఎన్ని లాజిక్కులు అయినా చెప్పనివ్వండి నాలుగు ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదుగా. 

మరింత సమాచారం తెలుసుకోండి: