టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ ఇండియా సెమీస్ అవ‌కాశాలు న్యూజిలాండ్‌, అప్గానిస్తాన్ మ్యాచ్ ఫ‌లితంపై ఆధార‌ప‌డి ఉన్నాయి. న్యూజిలాండ్ ను  అప్ఘానిస్తాన్‌ ఓడిస్తేనే భార‌త్‌కు సెమిస్ అవ‌కాశాలు ఉన్నాయి. దీనితో ఈ మ్యాచ్ మీద ఎంతో ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఒక‌వేళ అప్ఘానిస్తాన్‌పై న్యూజిలాండ్ గెలిస్తే ఎలా..? అని ఓ విలేక‌రీ వేసి ప్ర‌శ్న‌కు టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా  ఈ విధంగా స్పందించాడు.  బ్యాగ్ ఫ్యాక్ క‌ర్‌కే ఘ‌ర్ జాయేంగే అని సింపుల్‌గా రిప్లై ఇచ్చాడు. దీంతో ఆదివారం జ‌రిగే న్యూజిలాండ్- అప్గానిస్తాన్ మ్యాచ్‌పై ఆస‌క్తినెల‌కొంది.

అదేవిధంగా మేము మంచి క్రికెట్ ఆడాల‌ని చూస్తున్నాం. భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఎంతో ముఖ్యమ‌ని అంద‌రికీ తెలుసు. మా వంతుగా కృషి చేస్తున్నాం. జ‌ట్టు మొత్తం వంద‌శాతం మైదానంలో ఆడుతున్న‌ది. కేవ‌లం ఇప్పుడు మరొక‌ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. మనం ఇలాగే ఆడితే ఏ జట్టు కూడా మనల్ని ఓడించదు’ అని వెల్ల‌డించాడు జ‌డేజా. భారత్‌కు 86 పరుగుల విజయలక్ష్యాన్ని స్కాట్లాండ్ నిర్దేసిస్తే కేవ‌లం 6.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సాధించిన‌ది. దీంతో గ్రూప్‌లోనే భారత్‌ రన్‌రేట్‌ అత్యుత్తమంగా ఉంది. ఇక  స్కాట్లాండ్ తో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో జ‌డేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ద‌క్కించుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: