అనేక రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందంటున్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌...  దేశంలో తెలంగాణ పరిశ్రమల్లో మొదటిస్థానంలో ఉందంటున్న కేటీఆర్‌..  తెలంగాణ రాకముందు విద్యుత్ కోసం పరిశ్రమ వర్గాలు ధర్నాలు చేశాయని గుర్తు చేశారు. 2014 లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలన్ని వెనక్కి వెళ్లిపోతాయ్ అన్న విమర్శలు వచ్చాయని.. కానీ ఇప్పుడు 24 గంటల విద్యుత్ ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్‌ అంటున్నారు.


పరిశ్రమలసెక్టార్ లో అభివృద్ధి ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని.. ప్రపంచంలో ప్రతిఒక్కరు మాట్లాడుకునేది తెలంగాణ గురించేనని కేటీఆర్ అంటున్నారు.  గతంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ముందుండేవని.. కానీ ఇప్పుడు తెలంగాణ మొదటి స్తానంలో ఉందని కేటీఆర్ అంటున్నారు. మన దేశంలో ఆయా ప్రాంతాలని బట్టి ఆయా భాష మాట్లాడుతుంటారని.. భాష ని బట్టి టాలెంట్ ని అంచనా వేయకూడదని కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐ పాస్ ద్వారా ఇండస్ట్రీలకి 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: