పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని.. టిఆర్ఎస్ అంటోంది. ఆదివాసీలకు ఇబ్బంది కలిగేలా, వారి పొట్ట కొట్టెలాఫారెస్ట్ కన్సర్వేటషన్ బిల్లు ఉందన్న ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు... పార్లమెంట్ లో ఫారెస్ట్ కన్సర్వేషన్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. అగ్నిపథ్ పథకం పై పార్లమెంట్ లో లేవనెత్తుతామని.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పై పార్లమెంట్ లో చర్చ జరగాలని టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు అంటున్నారు.

దేశంలో కావాల్సినంత బొగ్గు దేశంలో ఉన్నా... దిగుమతి చేసుకున్న బొగ్గు ను వాడాలన్న అంశాన్ని లేవనెత్తుతామని.. వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం పై చర్చకు పట్టుబడుతామని టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు తెలిపారు. FRBM నిబంధనల పరిధిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నా... ఆర్ధిక ఇబ్బందులకు గురిచేసే యోచనలోనే కేంద్రం వ్యవహారిస్తోందని నామా అన్నారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్ ను కేంద్రం ఇబ్బంది పెడుతుందన్న నామా.. రూ. 3.65 లక్షల కోట్లు రాష్ట్రం నుంచి తీసుకున్న నిధుల కన్నా... తక్కువ నిధులు రాష్ట్రానికి ఇచ్చిందని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr