వర్షాకాలం వచ్చిందంటే చాలు చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తుంటే చాలా చికాకు పుట్టించే విధంగా ఉంటాయి. ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా నీళ్లు..బురుద అంతే కాదు ఈ సమయంలో ఎక్కువ రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తుంటారు. వర్షాకాలంలో చర్మం పట్ల చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.  వర్షకాలంలో చలి, వాతావరణం కారణంగా మన చర్మం పగిలిపోవడం, చర్మం ఊడిపోవడం, మంట పెట్టడం, దురదపెట్టడం, లాంటి సమస్యలతో బాధపడుతుంటారు.

Image result for dry skin care

ఈ బాధలనుంచి ఉపశమనం పొందాలంటే వేజులీన్ వంటి క్రీములు ఎక్కవగా శరీరానికి రాస్తుంటటారు. కానీ ఇవి సమస్యకు పరిష్కారం కాదు, చలికాలంలో శరీరం పగులకుండా ఉండాలంటే ముందుగా మనం ఒళ్లు రుద్దుకునేందుకోసం సబ్బుల పట్ల జాగ్రత్తలు వహించాలి. రోజు ఒళ్లంతా కాస్త మంచి నూనెను రాసుకుని ఆ తర్వాత శనగపిండితో ఒంటిని రుద్దుకంటూ స్నానం చేయాలి. మరి అంతగా అవసరమనుకుంటే ఓ నాలుగయిదు రోజులకు ఓ సారి సబ్బును వాడితే సరిపోతుంది.

Image result for dry skin care

చలికాలంలో శనగపిండిని వాడితే ప్రయోజనాలు :ప్రధానంగా మన చర్మం పాడవ్వదు, సబ్బుల వాడకం, తద్వారా ఆయా పరిళల నుంచ ఉత్పన్నమయ్యే కాలుష్యం తగ్గిపోతాయి. పగిలిన చర్మకోసం దాడే క్రీముల వంటి వాటి వాడకం తగ్గిపోతుంది. 

Image result for dry skin care

పర్యావరణానికి అనుకూలంగా ఉండే శనగపిండితో స్నానం విధానాన్ని అసహ్యించుకోకూడదు. అలాగే చలికాలంలో దొరికే అన్ని రకాల పళ్లను, కాయకూరలను తినడం ద్వారా కూడా చర్మాన్ని చక్కగా ఉంచుకోవచ్చు మరి. 


ఇంకో పద్దతిలో... పెరుగు, పసుపు, తేనే కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మాస్క్ వేసుకునేటప్పడు... పోడిచర్మం వారు తేనే రోజ్ వాటర్, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగివేయాలి.. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు.


ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా అరటిపండు, యాపిల్, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనే కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టగా ఉంటుంది.  ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత వెనిగర్ కలిగర్ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: