వెంట్రుక‌ల‌ను సంరక్షించుకోవ‌డంలో మ‌హిళ‌లే కాదు, పురుషులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు. వారు కూడా త‌మ శిరోజాల సంర‌క్ష‌ణ‌కు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే చాలా మంది త‌ర‌చూ త‌ల‌స్నానం చేస్తూ ఉంటారు. ఇది అంత మంచిది కాదు. వాస్త‌వానికి పొడిబారిన జుట్టు ఉన్నదంటే జుట్టుకు అవసరమైన తేమ లోపించిందని అర్థం. షాంపూతో జుట్టును తరచూ శుభ్రం చేసుకోవడం కారణంగా జుట్టు మరింత తేమను కోల్పోతుంది. ఎందువల్ల అంటే షాంపూలలో కఠినమైన రసాయనాలు ఉంటాయి.


మరియు అవి తల మీద ఉండే ముఖ్యమైన నూనెలు పూర్తిగా తొలగింపబడతాయి. దీని వ‌ల్ల‌ తల మీద తేమ పూరిగా ఇగిరిపోయి, ఎండినట్లుగా అవుతుంది. పొడి జుట్టు ఉన్నవారు వారంలో వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. పీహెచ్ శాతం 5 లేదా 5.5 శాతం ఉన్న షాంపూనే ఎంచుకోవాలి. స్టైలింగ్ ఉత్పత్తులు వాడేటప్పుడు ఆల్కహాల్ లేని రకాల్ని ఉపయోగించాలి. తలస్నానానికి ముందు ఎసెన్షియల్ నూనెల్ని కొబ్బరినూనెతో కలిపి జుట్టుకి రాసి మర్దన చేసుకోవాలి. 


అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వీటన్నింటితోపాటు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సరైన పోషకాహారం తీసుకోవాలి. అలాగే ఆయిలీ హెయిర్ ఉండేవారు ప్రతి రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే మంచిది. తలస్నానం చేసిన ప్రతి సారీ జుట్టుకు కొంత సిరం, నూనెను అప్లై చేయాలి. ఇలా చేస్తే క్రమంగా జుట్టుకు పోషణ అందుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: