ఎప్పుడు మేకప్ వెయ్యని వారు.. ఒక్కసారిగా అందంగా కనిపించాలంటే చాలా కష్టం. ఒకొక్కసారి అనుకోకుండా ఫంక్షన్ లకు హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో మేకప్ ఎలా వేసుకోవాలి.. ఎలా వేసుకుంటే అందంగా కనిపిస్తాం అనేది చాల మందికి తెలియదు. అలాంటి వారంతా ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

పెదవులు మెరవాలంటే.. 

 

ఐ షాడో బ్రష్‌ మీద కొద్దిగా హైలైటర్‌ అద్దుకొని పైపెదవి అంచు మీద ఒక గీతలా గీసుకోవాలి. దీంతో పెదవులు మెరుస్తూ, సరికొత్తగా కనిపిస్తాయి.

 

ముక్కు.. 

 

చిన్న బ్రష్‌తో మ్యాటిఫయింగ్‌ పౌడర్‌, హైలైటర్‌ను ముక్కుకు రాసుకుంటే ముక్కు చిన్నగా, అందంగా కనిపిస్తుంది. 

 

ఐ షాడో, ఐ లైనర్‌.. 

 

మేకప్‌ బ్రష్‌ మీద కొద్దిగా ఫిక్సింగ్‌ స్ర్పే చల్లి, ఆ బ్రష్‌ను పౌడర్‌ హైలైటర్‌లో అద్దితే ఐ లైనర్‌ రెడీ. దీంతో కనురెప్పలు అందంగా కనిపిస్తాయి. 

 

కళ్లు..

 

ముఖానికి అందం తెచ్చేదే కళ్లు.. అలాంటి కళ్లకు అందంగా లోపలి అంచుల వరుకు హైలైటర్‌ అప్లై చేస్తే కళ్లు కొత్తగా, కాంతివంతంగా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: