అంద‌మైన‌.. ఆరోగ్య‌మైన‌.. దృడ‌మైన జ‌ట్టును ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కొంతమందికి ఒత్తుగా, మరికొందరికి సిల్కీగా, ఇంకొందరికి ఉంగరాలు తిరిగి, ఇంకా కొందరికి పలచగా ఇలా ఎన్నో రకాలుగా జట్టు ఉన్నవాళ్లుంటారు. ఇక‌ జుట్టు రాలడం, చుండ్రు మరియు తెల్ల జుట్టు సమస్యలు ఎప్పుడూ ఉండేవే. జుట్టు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించే మెరుగైన పదార్థాల్లో ‘ఉల్లి’ ఒకటి. ఇందులో పోషకాలు జుట్టును మరింత బలంగా మార్చి, వాటి పెరుగుదలకు దోహదపడుతాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే సల్ఫర్ మూలకం తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంద్రాలు తిరిగి తెరవబడతాయి.

 

దీనికి ముందుగా ముద్ద మందారం ఆకు లేదా పువ్వులు మరియు కొద్దిగా ఎర్రగా ఉండే ఉల్లిపాయను తీసుకుని రెండింటిని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను తలకు మరియు జుట్టు మొత్తానికి రాయాలి. కాస్త స‌మ‌యం త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే.. జుట్టు ఆరోగ్యానికి మరియు బ‌లంగా మారుతుంది. బట్టతల సమస్య బాధ‌ప‌డుతున్న వారు కూడా ఈ టిప్‌ను ఉప‌యోగిస్తే.. ఈ సమస్యను శాశ్వతంగా తొలగిస్తుంది.  ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది.

 

అలాగే ఉల్లిపాయ నుండి రసాన్ని వేరుచేసుకొని అందులో రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు చిక్కుపడకుండా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. హెయిర్ గ్రోత్ ను కూడా పెంచుతుంది. ఉల్లిపాయ రసం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. జుట్టులో ఉన్న ఫంగస్ ని హరింపచేసి, చుండ్రును నివారించి, తెల్లజుట్టు నల్లగా మార్చుతుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: