అందంగా, ప్ర‌కాశవంతంగా క‌నిపించాల‌ని అందంగా కోరుకుంటారు. అయితే దీనికి భిన్నంగా చర్మం తరచుగా పెళుసుగా మారడం, పాడైపోవడం, మొటిమల బారిన పడడం, మృత కణాలు పేరుకుని పోవడం, డెడ్ స్కిన్, డార్క్ స్పాట్స్, చారలు, వృద్దాప్య చాయలు, కంటి కింద వలయాలు, చర్మం ముడతలు పడడం వంటి స‌మ‌స్య‌లుఎదుర్కొంటుంటాము . ఈ క్ర‌మంలోనే చాలా మంది అనేక కెమిక‌ల్ ప్రోడెక్ట్స్ వాడుతుంటాయ‌. మ‌రి కొంద‌రు కనీసం ఫేస్ కూడా వాష్ చేసుకోవడానికి కూడా తీరిక ఉండదు. మీరు ఎంత బిజిగా ఉన్నా సరే కచ్చితంగా కాస్త మీ చర్మ సంరక్షణపై ద్రుష్టిపెట్టండి. 

 

ముఖ్యంగా రోజూ ఉదయం మీరు పాటించే కొన్ని అలవాట్లు మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతాయి. రోజూ ఉదయం లేవగానే టీ కాకుండా ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగాలి. అలాగే ఉదయం లేవగానే మీరు చేయాల్సిన పని.. మీ ముఖానికి ఆవిరిపట్టడం. దీంతో చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. కాంతివంతంగాం మారుతుంది. అదే స‌మ‌యంలో ముఖానికి ఉపయోగించే క్రీమ్ లు, సోప్ ల్లో ఎక్కువ రసాయనాలు లేకుండా చూసుకోండి. ఇక మీరు ఉపయోగించే టోనర్ యాంటీఆక్సిడెంట్, ఆల్కహాల్-ఫ్రీ గా ఉండేటట్లు చూసుకోండి. 

 

అలాంటి వాటిని ఉపయోగిస్తే చర్మం సున్నితత్వం కోల్పొదు. ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. రోజూ తృణధాన్యాలతో తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తింటూ ఉండండి. ఇది మీ చ‌ర్మ సౌంద‌ర్యానికి మ‌రింత మేలు చేస్తుంది. రోజూ ఉదయం లేవగానే కొన్ని రకాల వర్క్ అవుట్స్ చేయాలి. ఇవి మీ చర్మం సున్నితంగా ఉండి అందంగా ఉండేందుకు దోహదపడతాయి. అదేవిధంగా, రోజూ మీరు ఉదయం పూట తీసుకునే బ్రేక్ ఫాస్ట్ కూడా మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. సో.. ప్ర‌తి రోజు ఖ‌చ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: