సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక టైమ్ జుట్టు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. జుట్టు రాలిపోవ‌డం, బ‌ల‌హీనంగా మార‌డం, వెంట్రుకుల చివ‌ర్లు పొట్లిపోవ‌డం, చుండ్రు ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు మ‌నం ఎదుర్కొంటాం. పోషకాహారలోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌, పిల్లలు పుట్టకుండా వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్‌ వల్ల, విపరీతమైన ఒత్తిడి కారణంగా, అలాగే శరీరానికి హానికలిగించే కెమికల్స్‌తో తయారైన హెయిర్‌ ప్రాడెక్టులు వినియోగించడం ఇలా ఎన్నో కార‌ణాల వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాం. 

 

మ‌రియు కాలుష్యం కారణంగా కూడా జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ స‌మ‌స్య‌ల‌కు ప్ర‌త్యేకంగా కేరింగ్ తీసుకోలేనివారు.. త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు షాంపూలో కొన్ని క‌లిపి యూజ్ చేస్తే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌రి అవేంటి..? వాటి వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు పొందొచ్చు..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా.. త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు షాంపూలో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ని కలిపి తల రుద్దుకోవాలి. ఈ విధంగా రోజ్ వాటర్ ని కలపటం వలన జుట్టుకు అవసరమైన తేమ అంద‌డ‌మే కాకుండా జ‌ట్టు ఆరోగ్యంగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

 

షాంపూలో ఒక స్పూన్ ఉసిరి నీటిని కలిపి వాడడం వల్ల జుట్టు రాలకుండా ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది. అలాగే షాంపూలో రెండు చుక్కల బాదం నూనెను కలిపి త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల జ‌ట్టు రాల‌డాన్ని త‌గ్గించి కేశాల‌ను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. మ‌రియు త‌ల‌స్నానం చేసేటప్పుడు షాంపూలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలను రుద్దుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలో చుండ్రు, దురదను తగ్గించటంతో పాటు ఇత‌ర ఇన్ఫెక్షన్స్ ఉంటే త‌గ్గిందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. వీటితో పాటు పోషకాహారం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. కాబ‌ట్టి.. ఇప్పుడు చెప్పుకున్న టిప్స్ పాటు పోష‌కాహారం కూడా తీసుకోండి. అప్పుడే మంచి ఫ‌లితం పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: