మొటిమ‌లు.. నేటి కాలంలో స్త్రీలు ప్ర‌ధానంగా ఏదుర్కొంటున్న స‌మ‌స్య‌. ముఖ్యంగా టీనేజీలోకి అడుగుపెట్టగానే చాలా మందికి మొటిమల సమస్య ఎదుర‌వుతుంది. రాత్రి పడుకున్నప్పుడు అందంగా కనబడిన ముఖం ఉదయానికి మొటిమలతో కనబడితే ఇక అంతటి నరకం మరొకటి ఉండదేమో. కానీ, కొందరికి వయసుతో పాటు తగ్గిపోయినా కొందర్ని మొటిమలు వీడకుండా ఇబ్బందిపెడతాయి. వాస్త‌వానికి చర్మంపై వెంట్రుకల కుదుళ్లు లేదా రంధ్రాలు అదనపు నూనె, బ్యాక్టీరియా మరియు చనిపోయిన చర్మ కణాలతో ప్లగ్ అయినప్పుడు మొటిమల వ‌స్తుతంటాయి. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవాలంటే.. ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే స‌రిపోతుంది.

 

అందులో ముందుగా..   నిమ్మకాయలో ఉన్న లక్షణాలు మొటిమలను తగ్గించటంలో సహాయపడతాయి. కొంచెం పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, ముఖానికి రాసి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు, వాటి వ‌ల్ల వ‌చ్చే మచ్చలు తగ్గుతాయి. ముఖం జిడ్డుగా ఉంటే మొటిమల సమస్య పెరుగుతుంది. ఆపిల్‌ స్లైస్‌తో ముఖమంతా మృదువుగా రబ్‌ చేసి, పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపైన జిడ్డు తగ్గి, చర్మం తాజాగా కనిపిస్తుంది. అరటిపండు తిని, తొక్కను ముఖం మీద రుద్దండి. 

 

ముఖంలో రుద్దిన తర్వాత అర గంట త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే మొటిమ‌ల‌కు చెక్ పెట్టాలంటే.. ఫోన్‌కు దూరంగా ఉండాలి. నిజానికీ ఫోన్ మాట్లేడప్పుడు మనం ఫోన్‌ని ముఖం దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటాం. దీని వల్ల ఫోన్‌కి ఉన్న బ్యాక్టీరియా మన ముఖానిపై చేరి మొటిమల సమస్యకి కారణంగా మారుతుంది. అదేవిధంగా, ముఖం కడగడం వల్ల కూడా ఫేస్ క్లీన్ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. కానీ, అతిగా కడగడం వ‌ల్ల‌ చర్మంలోని సహజనూనెలు తగ్గి మొటిమ‌ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబ‌ట్టి, ప‌దే ప‌దే ముఖాన్ని క‌డ‌గ‌డం మానేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: