నిజానికి చాలామంది శరీరంపై పెద్దగా దృష్టి పెట్టారు. మన శరీరానికి కావలసిన తేమను మనం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి. అలాగే మన శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల నీటిని తాగుతూ, తాజా పండ్ల రసాలను తాగుతూ ఉండాలి. అలాగే రోజూ మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి. టోనింగ్ చేయడం వంటివి అలవాటుగా మార్చుకోవాలి..
జిడ్డు ఎక్కువగా ఉన్న మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. అందుకే తేలికైన, చర్మంలోకి సులువుగా ఇమిడిపోయే వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించాలి. అందులో ముఖ్యంగా హాలురోనిక్ ఉన్న వాటిని వాడితే ఇంకా మంచిది..
సన్ స్క్రీన్ లోషన్ ను అసలు మర్చిపోకూడదు. బయట ఎండలు చర్మంలోని తేమను పీల్చుకుని, పొడిబారేలా చేసి,దురదలు పుట్టిస్తూ ఉంటుంది. అయితే కేవలం బయటకు వెళ్లినప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగిస్తే సరిపోదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ లోషన్ ను ఉపయోగించాలి.
మృతకణాలను తొలగించేందుకు స్క్రబ్బింగ్ పద్ధతిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ స్క్రబ్బింగ్ పద్ధతిని మరీ ఎక్కువగా వాడటం వల్ల చర్మం పాడవుతుంది. కాబట్టి బయట దొరికే కాస్మెటిక్స్ బదులు ఇంట్లో ఉండే పదార్థాలతో ఫేస్ స్క్రబ్ చేసుకోవడం మంచిది. అందులో మరీ ముఖ్యంగా కాఫీ పౌడర్ తో చక్కెర తో ఫేస్ స్క్రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి