ప్రస్తుత కాలంలో ధుమ్మూ, ధూళి, ఒత్తిడి, కాలుష్యం, జంక్ ఫుడ్స్ కారణంగా చర్మం, జుట్టు సమస్యలు చాలా ఎక్కువవుతూనే ఉన్నాయి.అయితే వీటన్నింటినీ ఒక్క బాదం ఆయిల్ తో ఈజీగా దూరం చేసుకోవచ్చు.అలాగే స్కిన్ ని మెరిపించుకోవడంతో పాటు జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఇది కాస్త ఖరీదైనదే కానీ.. తక్కువ మోతాదులో వాడిన కూడా ఫలితం కనిపిస్తుంది. బాదం ఆయిల్ లో పొటాషియం, ప్రటీన్, జింక్, విటమిన్ ఏ, ఇ ఇంకా మోనో శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని, జుట్టును బాగా రక్షిస్తాయి. మరి ఈ బాదం ఆయిల్ ను ఎలా వాడాలి? ఇంకా దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే ఇప్పుడున్న కాలుష్యం కారణంగా జుట్టు పొడి బారిపోవడం, చివర్లు చిట్లడం, విపరీతంగా రాలిపోవడం వంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు బాదం, ఆలివ్, ఆముదం నూనెల్ని  సమ భాగాలుగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల దాకా బాగా పట్టించి, మసాజ్ చేసుకోవాలి.


ఇలా వారానికి 2 సార్లు  చేస్తే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. బాదం నూనెను  డైరెక్ట్ గా కూడా తలకు రాసుకోవచ్చు.ఇక దీని వల్ల మృదువైన, ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.అలాగే మనం డార్క్ సర్కిల్స్, పొడి బారిపోవడం, గ్లో లేకపోవడం, ముడతలు, మచ్చటు, మొటిమలు ఇలా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికి బాదం ఆయిల్ తో ఈజీగా చెక్ పెట్టవచ్చు. రాత్రి పడుకునే ముందు ముఖం, గొంతు భాగాలకు నూనెతో ఓ ఐదు నిమిషాలు పాటు మసాజ్ చేసుకోవాలి. దీన్ని ఇలానే రాత్రంతా వదిలేసి ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో కడుక్కుంటే ఖచ్చితంగా మంచి గ్లోతో పాటు సాఫ్ట్ గా మెరిసే చర్మం కూడా మీ సొంతం అవుతుంది.అయితే రాత్రి రాసుకోలేని వారు మాత్రం ఉదయాన్నే స్నానం చేసే గంట ముందు ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకుని గోరు వెచ్చటి నీటితో కడిగేయవచ్చు.అప్పుడు ఫేస్ కూడా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: