మగ్గుమచ్చలు ఇవి పెద్ద సమస్యగా మారాయి.ఇవి ఒకసారి వచ్చాయంటే మల్లి తగ్గటానికి చాలా టైమ్ పడుతుంది.ఈ సమస్యని ఎక్కువగా మహిళలలో చూస్తూ ఉంటాము.అయితే కొన్ని జాగ్రత్తలు చిట్కాలు ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల వీటిని తగ్గించుకోవచ్చు.అసలు ముందుగా ఈ మంగు మచ్చలు రావటానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటే వాటికి పరిష్కారం దొరికినట్టే.మరి అవేంటో చూద్దాం.శరీరంలో నీటిశాతం తగ్గిపోవటం వల్ల ఇవి వచ్చే అవకాశం ఉంది.సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇవి రావచ్చు.వయసులో వచ్చే మార్పుల కూడ దీనికి కారణం కావచ్చు.శరీరంలో వుండే మెల్లనిన్ అనే ద్రవ్యం ఎక్కువగా విడుదల కావడం వల్ల ఈ సమస్య బారిన పడతారు.ఈ సమస్య వచ్చినపుడు ఫేస్ పై సూర్యకాంతి ఎక్కువగా పడటం వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువవుతుంది.కనుక మీరు మీ ముఖానికి ఎండ తగలకుండా జాగ్రత్త పడండి.అయితే వీటిని నివారిచడం పెద్ద కష్టమేని కాదు.పెద్ద ఖర్చుకూడా కాదు.మన ఇంట్లోనే మనకి తెలియకుండా ఎన్నో ఔషద గుణాలు కలిగినవి చాలా ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.


ఆలుగడ్డ దీనినే బంగాళాదుంప అని కూడా పిలుస్తారు.ఈ బంగాళాదుంప రసాన్ని ప్రతిరోజు మంగుమచ్చలు ఉన్న చోట రాసి నెమ్మదిగా మర్ధన చేయడం వల్ల ఈ మచ్చలు తగ్గుముఖం పడతాయి.మనం పెంచే మొక్కల్లో కలబంద గుజ్జు ఈ సమస్యకి మంచి ఫలితాన్ని ఇస్తుంది.క్రమం తప్పకుండ ప్రతిరోజు దీనిని అప్లే చేయడం వల్ల ఈ సమస్య దూరం అవుతుంది.శరీరానికి తగినన్ని నీరు తాగడం వల్ల మంచి జరుగుతుంది.స్వచ్ఛమైన తేనేని ఈ మంగు మచ్చలకి రాయడం వల్ల వీలైనంతా త్వరగా మచ్చలు మాయమవుతాయి.చలువ చేసే ఆహారాన్ని తీసుకోవడం వల్ల  శరీరం చల్లబడి ఈ మచ్చలు తగ్గుతాయి.వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కీరాదోసకాయ,సొరకాయ,పుచ్చకాయ,వంటివి తినడం వల్ల సమస్య తగ్గుతుంది.చందనం పాలు కలిపిన మిశ్రమాన్ని పట్టించడం వల్ల చర్మం కాంతివంతగా మారి మృదువుగా తయారవుతుంది.ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల సమస్య ఎక్కువ కాకుండా నివారించుకొవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: