మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ యూనిట్ చాలా రోజుల నుండి పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన చాలా ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మూడు పాటలను విడుదల చేయగా ఆ మూడు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ కూడా ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఏ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ యూ ఎస్ ఏ ప్రీమియర్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమాకు యూ ఎస్ ఏ ప్రీమియర్స్ ఫ్రీ సేల్స్ ద్వారా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు ఇప్పటి వరకు యూ ఎస్ ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా 200 కే ప్లస్ కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి నయనతార హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: