టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ నటించిన రెండు సినిమాలు పోయిన సంవత్సరం విడుదల అయ్యాయి. అందులో పోయిన సంవత్సరం మొదటగా హరిహర విరమల్లు సినిమా విడుదల కాగా , ఆ తర్వాత ఓజి సినిమా విడుదల అయింది. ఇందులో హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కాగా , ఓజి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల , రాశి కన్నా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి యంగ్ బ్యూటీ సాక్షి వైద్య కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

సాక్షి వైద్య తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కీలక పాత్రలో అవకాశం వచ్చింది. కానీ నేను ఆ సమయంలో నా కుటుంబం అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఇక అదే సమయంలో ఆ మూవీ టీం సభ్యులు నాకు ఫోన్ చేసి రేపటి నుండి షూటింగ్ను ప్రారంభిస్తున్నాము అని చెప్పారు. ఆ సమయంలో నేను సినిమా షూటింగ్ కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాను. అలాగే తేదీలు సర్దుబాటు చేయలేక ఆ సినిమాను వదులుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఇలా సాక్షి వైద్య ఉస్తాది భగత్ సింగ్ మూవీ అవకాశాన్ని వదులుకుంది అని ఆమె చెప్పడంతో ఈమె ఆ సినిమా చేసి ఉండి ఉంటే ఈమెకు మంచి క్రేజ్ వచ్చేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: