మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, సాహు గరికపాటి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరు నిర్మాతలు ఇటీవలే మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే సుస్మిత కొణిదల సరదాగా మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీ ఫేవరెట్ హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా? అందుకు రజనీకాంత్ అని చెప్పగా టాలీవుడ్ లో ఎవరూ లేరా అంటూ అడగగా? నవ్వుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంది.
దీంతో సుస్మిత కొణిదెలకు తన ఇంట్లో వారు కాకుండా తన ఫేవరెట్ హీరో రజనీకాంత్ అన్నట్లు తెలియజేసింది. ఇక తన తండ్రి చిరంజీవితో కలిసి సినిమా తీయడమే నాకు ఒక పెద్ద గిఫ్ట్ అని, ఇక బాబాయ్ తో సినిమా చేయాలని నాకి ఉంది. ఆల్రెడీ ఈ విషయం మీద పవన్ బాబాయ్ ని కూడా అడిగాను కానీ రాబోయే రోజుల్లో అది జరుగుతుందా లేదా అనే విషయం బాబాయ్ చేతిలోనే ఉందని తెలిపింది. ప్రస్తుతం సుస్మిత కొన్ని గల చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి