ఉద్యోగాల పేరుతో ఆశ చూపి నిరుద్యోగుల ఓట్లను కూటమి పార్టీ దండుకున్నాయంటూ విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఏడాది పూర్తి అయ్యి రెండో ఏడాది మరొక కొన్ని నెలలలో పూర్తి అవుతుంది. అయినా కూడా జాబు క్యాలెండర్ ఉసేఎత్తడం లేదంటూ నిరుద్యోగ జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది అంటూ ఫైర్ అయ్యింది షర్మిల. గత వైసిపి పాలన పైన విమర్శలు చేస్తూ.. గత ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువత చెవుల్లో పూలు పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవరే పెడుతోందంటూ ఎద్దేవ చేస్తోంది షర్మిల.
2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబు క్యాలెండర్ ఎక్కడా అంటూ నిరుద్యోగుల తరపు నుంచి తాను ప్రశ్నిస్తున్నారని హెచ్చరించింది. ఈ జాబు క్యాలెండర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, అప్పులు చేసుకొని మరి కోచింగ్ లు తీసుకుంటున్నారని ఉద్యోగాలు ఇస్తారా లేదా అని తీవ్ర ఆందోళనలో ఉన్నారంటూ తెలియజేసింది. ఏపీ ప్రభుత్వ శాఖలలో 2 లక్షల పైగా ఖాళీలు ఉన్నాయని వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలియజేసింది. ఎన్నికలకు ముందు రికార్డు చేసి పెట్టుకోండి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానంటూ చెప్పిన కూటమి ఇప్పుడు ఆ వాగ్దానానికి విలువ లేదు అంటూ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ట్వీట్ వైరల్ అవుతోంది. మరి ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి