అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీ పై అక్కినేని ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ మళ్ళీ రిజల్ట్ ఎప్పటిలాగే ఉంటుందా అనే డౌట్ కూడా ఉంది.ఎందుకంటే ఇప్పటివరకు అఖిల్ చేసిన ఏ సినిమాలు కూడా ప్రేక్షకులని అలరించడం లేదు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ కి కూడా సినిమాలు నచ్చడం లేదు. అయితే అలాంటి అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే మూవీతో వస్తున్నారు. ఏజెంట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ లెనిన్.. అయితే ఈ మూవీ నుండి రీసెంట్గా ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ సింగిల్ తో పాటు పనిలో పనిగా రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే మే 1న లెనిన్ మూవీ విడుదల కాబోతుందని అఫీషియల్ గా ప్రకటించారు చిత్ర యూనిట్.కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రకటించిన రిలీజ్ డేట్ ని చూసి చాలామంది డౌట్ పడుతున్నారు.దానికి ప్రధాన కారణం మే 1 న ఇప్పటికే గూఢచారి 2 మూవీ విడుదల కాబోతున్నట్టు ప్రకటించేశారు. 

ఇక అడివి శేష్ నటించిన గూఢచారి మూవీ భారీ హిట్ కొట్టడంతో సీక్వెల్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా ఒకేరోజు ఈ రెండు సినిమాలు విడుదలయితే మోస్ట్ ఆఫ్ ది సినీ ప్రేక్షకులు గూఢచారి 2 సినిమానే చూడడానికి పరుగులు పెడతారు.ఈ సినిమానే అనుకుంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ కూడా సమ్మర్ లోనే విడుదలవుతుందని ప్రకటించారు. అయితే మొదట ఎప్రిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత మే మొదటి వారంలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట చిత్ర యూనిట్.ఈ విషయం తెలియడంతో గూఢచారి 2 మూవీ యూనిట్ అయోమయంలో పడిపోయింది. విశ్వంభర కి పోటీగా వెళ్దామా..వద్దా అనే సతమతంలో ఉన్న సమయంలో లెనిన్ మూవీ కూడా మే ఫస్ట్ నే అని రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడంతో అక్కినేని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు ఒక్కసరైన హిట్ లేని అక్కినేని అఖిల్ సోలోగా వస్తే ఏదో కొంత రిజల్ట్ ఉంటుంది.

కానీ ఇలా గట్టి పోటీ మధ్య తన సినిమాని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వడం కష్టమే అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . సోలోగా వచ్చి సినిమా హిట్ చేసుకోవడం తప్పితే మరో ఆప్షన్ లేదని మాట్లాడుకుంటున్నారు. మరి విశ్వంభర, గూఢచారి-2  సినిమాలు విడుదలవుతున్నా పర్వాలేదని లెనిన్ మూవీ విడుదల అవుతుందా..అఖిల్ ఆ సాహసం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.మరోపక్క ఈ సినిమాకి నిర్మాతగా నాగవంశీ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా సినిమా వాయిదా విషయంలో ముందుగానే ఆలోచన చేస్తారు. ఎందుకంటే నాగవంశీ చేసే సినిమాలు ఎక్కువగా వాయిదా పడుతూనే ఉంటాయి. అలా నాగ వంశీ సినిమాల వాయిదా పద్ధతి చూసుకుంటే లెనిన్ మూవీ చివరి నిమిషంలో వాయిదా వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక అక్కినేని అఖిల్ నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా మొదట శ్రీలీలని తీసుకొని ఆ తర్వాత ఆమెను తీసేసి ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్ గా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: