కొంతమంది సెలబ్రిటీలు తమ పార్ట్నర్ తో ఈవెంట్స్ కు ఫంక్షన్స్ కు వెళ్తూ ఇన్ డైరెక్ట్ గా ప్రేమలో ఉన్నామనే హింట్ ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ వివాహం చేసుకుంటానని పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. గత కొంతకాలంగా ప్రముఖ రైటర్ గా పేరు సంపాదించిన రాహుల్ మోదీతో ప్రేమలో ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి వెకేషన్స్ డిన్నర్స్ కు వెళ్తూ ఉండడంతో ఈ విషయం ఎక్కువగా వినిపిస్తోంది.
అయితే తమ రిలేషన్షిప్ గురించి మాత్రం ఎక్కడా అఫీషియల్ గా స్పందించలేదు. ఎన్ని వార్తలు వచ్చినా కూడా సైలెంట్ గానే ఉన్నారు ఈ జంట. ఈ క్రమంలోనే జువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా శ్రద్ధా పెళ్లి పైన స్పందిస్తూ తన లవ్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఒక వీడియోని విడుదల చేసింది. మీ పెళ్లి సంగతేంటి అంటూ ఒక నెటిజన్ అడగగా?.. అందుకు శ్రద్ధా స్పందిస్తూ నేను కూడా వివాహం చేసుకుంటాను అంటు రిప్లై ఇచ్చింది అది చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు? మరి వివాహం ఎప్పుడు? రాహుల్ ని వివాహం చేసుకుంటుందా? లేక వేరే వ్యక్తినా అనే అనుమానాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రభాస్ నటించిన సహో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి