ఈ రోజుల్లో చాలా మంది కూడా అనేక రకాల జుట్టు సమస్యలతో ఎంతగానో బాధ పడుతున్నారు. చాలా మంది జుట్టు రాలిపోవడం, చుండ్రు పట్టడం,చిట్లిపోవడం, తెల్లగా అవ్వడం, ఇలా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ వుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ తో ఈ సమస్యలన్నిటికీ చాలా ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.రోజ్మేరీ ఆయిల్ అందానికి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ ఆయిల్ ఆయిల్ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను, జుట్టుకు పోషణ అందించడంలో హెల్ప్ అవుతుంది.క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు పెరిగేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి స్కాల్ప్ సమస్యలతో పోరాడతాయి.


ఇది చుండ్రును దూరంచేసి మంచి స్కాల్ప్ను అందిస్తాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి. ఈ ఆయిల్ను రెగ్యూలర్గా ఉపయోగించడం వల్ల జుట్టు తంతువులు చాలా బలంగా మారుతాయి. జుట్టు చిట్లిపోయే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఈ ఆయిల్ మొత్తం జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఆరోగ్యంగా, దృఢంగా కనిపిస్తుంది. నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు, మెత్తం స్కాల్ప్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే మనం ఈ రోజ్మేరీ ఆయిల్ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వేడి చేసిన ఆలివ్ నూనెలో రోజ్మోరీ ఆకులను వేయండి. దానిని వేడి చేయకుండా.. పూర్తిగా చల్లారనివ్వాలి. దానిని మరోసీసాలోకి మార్చండి. మెరుగైన ఫలితాల కోసం ఈ నూనెను మీరు వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేస్తే చాలా మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయిల్ వాడండి. ఎన్నో రకాల జుట్టు సమస్యలకి చాలా ఈజీగా చెక్ పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: