అసలు కరొనతో విసిగి వేసారుతుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు మరోసారి ఎబోలా విజృంభిస్తోంది. అంతమై పోయింది అనుకుంటే మళ్లీ దీని ఉనికి ని చాటుకుంటోంది. సరిగ్గా 2018 లో దక్షిణ ఆఫ్రికా దేశంలోని కాంగోలో బేణీ నగరంలో మొదలైన విషయం తెలిసిందే అప్పుడు దాదాపుగా 2 వేలకు పైగా అక్కడ చనిపోయారు. దాదాపు 20 నెలలుగా ఎబోలా కేసు లు లేకపోవడంతో వైరస్ పూర్తిగా చనిపోయిందనుకున్నారు.

 

ఇదేవిషయాన్ని WHO అధికారికంగా ప్రకటించాలనుకుంది కానీ WHO ఆశలకు నీళ్ళోసినట్లు అయ్యింది. శని , ఆదివారాల్లో కాంగో లో రెండు కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం 26 ఏళ్ల యువకుడు, ఆదివారం యువతి ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. 2018 సంవత్సరం కాంగోలో ఎబోలా వైరస్ కారణంగా 2276 మంది ప్రాణాలు కోల్పోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: