కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలకు సుమారు 4,12,400 పీపీఈ కిట్లను సరఫరా చేసింది. రాష్ట్రాలకు సుమారు 25,82,178 ఎన్ -95 మాస్క్‌ల‌ను అందించింది. ఇవ‌న్నీ కూడా దేశీయంగా, అంతర్జాతీయ ఉత్పత్తి అయిన‌వేన‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్రాల‌కు అవ‌స‌రమైన సాయం అందిస్తున్నామ‌ని పేర్కొంది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనో పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కు చేరుకుంది. వీటిలో 11,616 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని, మ‌ర‌ణాలు 452 సంభ‌వించాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి 24 నమూనాలలో ఒకటి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు అవుతుంద‌ని పేర్కొంది.

 

ఇలా ఉన్న‌ప్ప‌టికీ వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ రేటు తక్కువగా ఉందని వెల్ల‌డించింది. దేశంలో అత్య‌ధిక కేసులు మ‌హారాష్ట్ర‌లో సంభ‌విస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు  ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మరణాల సంఖ్య 149,000ను దాటిపోయింది. ఒక్క యూర‌ప్‌లోనే దాదాపు మూడింట రెండు వంతుల మరణాలు సంభవించాయని అంత‌ర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా 2.2 మిలియన్లకు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: