దేశంలో కరోనా వైరస్ కేసులు ఎప్పుడైతే మొదలు అయ్యాయో కానీ దాని ప్రతాపం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.  ఇప్పటి వరకు మొత్తం 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  ఈ దిక్కుమాలిన కరోనా చిన్నా పెద్దా.. సామన్యానుల ధనికులు అనే తేడా లేకుండా ఎవ్వరనీ వదలడం లేదు. ఇక ప్రజలకోసం బయటకు వచ్చి విధులు నిర్వహిస్తున్న పోలీసులు, డాక్టర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ప్రజలకు నిరంతరం వార్తలు అందిస్తున్న జర్నలిస్ట్ లకు కూడా కరోనా కాటేస్తుంది. ఇదివరకు మహారాష్ట్రలో 53 మంది రిపోర్టర్ లకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.

 

తమిళనాడులో కూడా ఓ ప్రముఖ ఛానెల్ లో పని చేస్తున్న జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. రిపోర్టర్లతో పాటు సబ్ ఎడిటర్లు సహా మొత్తం 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.  కరోనా సోకినవాళ్లను ఒమదురర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చాలని ఆదేశాలను జారీ అయ్యాయని తెలిపారు.  వీరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ముంబయిలో 53 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. 

 

తాజా సమాచారం ప్రకారం మరో 10 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం అందుతున్నది.  మీడియా జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకుతుండటంతో మీడియా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.  తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.  అయితే పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ లకు కరోనా సోకుతుండటం చాలా దురదృష్టకరం అని భారత ప్రభుత్వం తెలిపింది.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: