ప్రపంచవ్యాప్తంగా కరోనా క‌రాళ నృత్యం చేస్తోంది.  ఆయా దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి.  ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 26 లక్షలు దాట‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌ర‌నా బారిన ప‌డి మొత్తం 1,84,000పైగా  మృతి చెందారు. అమెరికాలో కరోనా వైరస్ విల‌యతాండ‌వం చేస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. స్పెయిన్, ఇటలీ దేశాల్లో పరిస్థితి అదుపులో ఉంది. చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

 

ప్రపంచవ్యాప్తంగా గురువారం 2,195 కొత్త కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం 26,37,911 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 169 మంది మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు 1,84,235 మంది మృ‌తిచెందారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజె ర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇవాళ 375 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,49,092 ఉండగా, ఇవాళ 22 మంది చనిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: