ప్రధాని మంత్రి లాక్ డౌన్ ను మే 3వ తేదీ తరువాత పొడిగించటానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈరోజు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ సీఎంలను వలస కూలీల సౌకర్యాలకు సంబంధించి ఆరా తీశారు. సీఎంలకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ ను పొడిగించటానికి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓకె చెప్పారు. 
 
 
కరోనా నియంత్రణ చర్యలు బాగానే పని చేస్తున్నాయని చెప్పారు. దశల వారీగా లాక్ డౌన్ గురించి ప్రధానంగా చర్చించారు. సీఎంలు ఆర్థిక లోటును పూడ్చటానికి ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకురావాలని కోరాలని పీఎం ప్యాకేజీ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మోదీ సీఎంలకు షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. 
 
అతి త్వరలో లాక్ డౌన్ పొడిగింపు గురించి మోదీ నుంచి కీలక ప్రకటన వెలువడనుంది. అన్ని అంశాలను పరిశీలించి కీలక నిర్ణయాలను అతి త్వరలో చెబుతామని మోదీ చెప్పినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: