కరోనా మహమ్మారి వల్ల నానాటికి  పాజిటివ్  కేసులు ప్రపంచమంతా  నమోదు అవుతూనే ఉన్నాయి.  ఇప్పటివరకు ప్రపంచ దేశాలనుండి 30 లక్షల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  ఇందులో మూడో వంతు అనగా 10 లక్షల వరకూ అమెరికా నుండే నమోదు కావడం గమనార్హం. అమెరికాలో ఇప్పటివరకు  9,64,937 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా 54841 మంది మృతి చెందారు.

IHG

 

 

 ప్రపంచ దేశాలలో 2.07 లక్షల మరణాలు నమోదు కాగా ఇందులో మూడో వంతు మరణాలు అమెరికా నుండి నమోదయ్యాయి. అమెరికాలో నమోదైన మరణాలలో ఎక్కువ శాతం న్యూయార్క్, న్యూ జెర్సీ లోనే నమోదు కావడం విశేషం. అమెరికాలో 28 వేల మంది మృత్యువాత పడగా న్యూయార్క్,  న్యూజెర్సీ లోనే నాలుగు లక్షల మంది చనిపోయారు. అయితే ట్రంపు మాత్రం అమెరికాలో వాణిజ్య కార్యకలాపాలన్నీ తిరిగి ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాడు. అయితే రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్నందున జార్జియా, ఓక్లహామా, అలస్కా వంటి ప్రాంతాలలో ఆంక్షలను  కడలిస్తున్నట్లు  పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న న్యూయార్క్, మిచిగాన్ రాష్ట్రాలలో మే 3 వ వారం వరకు ఆంక్షలను యధాతథం చేస్తున్నట్లు రాష్ట్రాల గవర్నర్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: