ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరో షాక్ ఇచ్చారు. లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాల ప్రకారమే కేంద్రం మరో రెండు వారాలపాటు కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించింది. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రధాని మోదీ లాక్ డౌన్ పొడిగించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నా వ్యాపార, వాణిజ్య వర్గాలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మరోసారి లాక్ డౌన్ ను పొడిగించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని వారు చెబుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా కొనసాగునున్నాయని కొన్నింటికి మాత్రం కేంద్రం సడలింపులు ఇవ్వనుందని తెలుస్తోంది. కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని కేంద్రం భావిస్తోంది. మరోవైపు రైళ్లు, విమానాలపై ఆంక్షలు కొనసాగనున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: