ఈ మద్య దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారిన పరిస్థితి ఏర్పడుతుంది.  అయితే ఈ సమయంలో రోడ్లపైకి ఎప్పుడూ అడవుల్లో తిరిగే పక్షులు, జంతువులు వస్తున్నాయి.  ఆ మద్య హైదరాబాద్ లో నెమళ్లు ఎంచక్కా రోడ్లపై విహరిస్తూ కనిపించాయి.  ఓ పులి రోడ్డు దాటుతూ వెళ్లింది.. కాకపోతే అది హైదరాబాద్ లో అంటూ పుకార్లు వచ్చినా తెలంగాణ అటవీశాఖ వారు కొట్టిపడేశారు.  ఇక తిరుపతిలో అలిపిరి ఘాట్ వద్ద ఎలుగులు స్వేచ్చగా సంచరిచండం చూశాం. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద చిరుత NH7 మెయిన్ రోడ్ పై కూర్చొని ఉంది చిరుత కు గాయాలు కావడంతో ఎటు వెళ్ళని పరిస్థితి లో హైవేపై ఉంది. 

 

అయితే ఆ చిరుత గాయాలతో ఉందని.. అందుకే కదలలేని పరిస్థితిలో అలాగే కూర్చుండిపోయిందని అంటున్నారు. చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఈ చిరుత ఎక్కడ నుంచి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చి విచారించిన తర్వాత అసలు విషయం తెలియనుంది. స్థానికులు మాత్రం ఆ చిరుత కాలికి తీవ్రమైన గాయం ఉండటం కారణంగా నిశ్చలంగా కూర్చొని ఉందని అంటున్నారు. మరో పక్క గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిది లోని  ఫతేదర్వాజ ప్రాంతంలో బ్లాక్ పాంతర్(చిరుత) సంచరిస్తుందంటూ కలకలం రేగింది. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు వలపన్ని పట్టుకుని జూ పార్కు కు తరలిస్తున్నారు. కాకపోతే అది బ్లాక్ పాంతర్(చిరుత) కాదని సివెట్ క్యాట్(గండు పిల్లి) అని గుర్తించారు అధికారులు. తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని జూపార్కులో దాని ఆరోగ్యాన్ని పరిశీలించిన మీదట తదుపరి చర్యలు తీసుకుంటామని PccF ఆర్. శోభ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: