తీరం దాటే ప్రక్రియలో భాగంగా అంఫాన్ తుఫాన్ ఇప్పుడు ఓడిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో భారీగా ఈదురు గాలులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరాన్ని దాటే ప్రక్రియ దాదాపు 4 గంటలు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళాక అది బలహీనపడుతుంది. ఓడిస్సాలోని పూరీ కటక్ కేంద్రపారా, గంజాం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 

 

బెంగాల్ బంగ్లాదేశ్ దగ్గరలోని సుంధర్భాన్ వద్ద తీరం దాటుతుంది అని అంచనా వేస్తున్నారు. భద్రక్ జిల్లాలో 200 కిలోమీటర్ల మేర గాలులు వీస్తున్నాయి. బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత అది వాయుగుండం గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: