తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ఖమ్మం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కరీంనగర్, సహా పలు జిల్లాల్లో నేడు ఎండలు చుక్కలు చూపించాయి. చాలా మంది ఇళ్ళల్లోనే ఉండిపోయి బయటకు రాలేదు. పలు చోట్ల వడ దెబ్బకు దాదాపు గా 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇక ఐఎండీ కీలక హెచ్చరికలు చేసింది. రేపు ఎల్లుండి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని కాబట్టి ప్రజలు అందరూ కూడా జాగ్రత్త గా ఉండాలని, పెద్దలు పిల్లలు అసలు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. రెంట చింతలలో నేడు 47 డిగ్రీల  ఉష్ణోగ్రత నమోదు అయింది. రేపు ఎల్లుండు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అని ఇళ్ళ నుంచి అవసరం అనుకుంటే మినహా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: