జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి  సంవత్సరం పూర్తయిన సందర్భంగా... రాష్ట్ర సంక్షేమం పై మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. 

 


 అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వివరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం ఏకంగా 1800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును కాలేజీలకు ఎగ్గొట్టింది అంటూ తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ము కింద ఏకంగా 4200 కోట్లు ఒకేసారి చెల్లించాము  అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఒకేసారి 4200 కోట్లు చెల్లించడం ఫీజు రియంబర్స్మెంట్ చరిత్రలోనే అతి పెద్ద రికార్డు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: