ఇటీవల షాద్ నగర్ లో ఒక అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో పలువురు దీనిపై పెద్ద ఎత్తున హడావుడి చేస్తూ పోలీసులను కూడా విమర్శించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఇది నిజమా కాదా అని తెలుసుకున్నారు. 

 

దీనిపై షాద్ నగర్ సిఐ మాట్లాడుతూ షాద్ నగర్ లో అమ్మాయిపై సామూహిక అత్యాచారం అవాస్తవం అని ఆయన స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో గ్యాంగ్ రేప్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళపై కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రచారం చేసిన వాళ్ళను గుర్తించామని చెప్పారు సిఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: