దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. నిన్న నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.5 లక్షలు దాటింది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన లెక్కల ప్రకారం నిన్న సాయంత్రానికి రెండున్నర లక్షలు దాటింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహారాష్ట్రలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్నటివరకు మహారాష్ట్రలో 85,975 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో చైనా దేశం కంటే అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం గమనార్హం. 

 

తమిళనాడు రాష్ట్రంలో 31,667 కేసులు నమోదు కాగా 269 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌ డౌన్‌ సడలింపుల తర్వాత అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. గుజరాత్ రాష్ట్రంలో కేసుల సంఖ్య 19,592గా ఉండగా 1,219 మంది మృతి చెందారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: