ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ సంస్థ గతంలో  సుప్రీం కోర్టులో పిటిషన్లు  దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసును సుమోటోగా తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్జీ పాలిమర్స్ ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ గురించి ఈరోజు సుప్రీంలో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన 3 పిటిషన్లపై కోర్టు విచారణ జరిపి వీటి గురించి వచ్చే వారం చివరిలోగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. 
 
ప్లాంట్ లోకి వెళ్లేందుకు అనుమతులు... మెటీరియల్ ను వెనక్కు తీసుకోవడానికి.... వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. గత నెల 7వ తేదీన విశాఖ జిల్లాలో గ్యాస్ లీకేజ్ ఘటన రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: