దేశంలో కరోనా రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఓ రేంజ్ లో విజృంభిస్తుంది.  ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి గ్రేడింగ్ ప్రకారం మార్కులు ఇచ్చిన విషయం తెలిసిందే.  పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలపై నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.  ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14, 15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’ అంటూ మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. 

 

ఇదిలా ఉంటే.. గతంలో 7వ తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు ఉండేవని ఆ తర్వాత తీసేశారని కొందరు తెలిపారు. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: