కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడిన వారి సంఖ్య కోటికి పైగానే, 5 లక్షల మంది ఈ మహమ్మారి వైరస్ తో మరణించారు. కొన్ని దేశాలు ఈ వైరస్ అరికట్టడంలో పురోగతి సాధించినా..  ఇప్పట్లో ఈ వైరస్ మాత్రం ముగియదు అంటూ తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ జనరల్ టెడ్రోస్  స్పష్టం చేశారు,

 


 ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి వైరస్ కు వ్యాక్సిన్  కనుగొనేందుకు పరిశోధనల్లో నిమగ్నమైన... ఇది విజయం సాధిస్తుందన్న నమ్మకం మాత్రం లేదు. ప్రస్తుతం చేయాల్సిందల్లా ఒక్కటే వైరస్ వచ్చిన వారిని గుర్తించడం మాత్రమే, ఈ విధానం ద్వారా వ్యాధిని నిరోధించవచ్చు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: