ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది. నాలుగు సార్లు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ వాయిదా వేసింది. ఇళ్ళ పట్టాలకు  ఇప్పుడు కరోనా అడ్డం వచ్చింది. ఇటీవ‌ల ఏపీలో ప్ర‌తి అంశానికి క‌రోనా అడ్డు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు సైతం క‌రోనాతో వాయిదా ప‌డ్డాయి. అప్ప‌టి నుంచి ప్ర‌తిదీ క‌రోనాతో వాయిదా ప‌డుతోంది. ఇక ఇళ్ల ప‌ట్టాల విష‌యానికి వ‌స్తే వాటిని ఎప్పుడు పంచె అవకాశం ఉంది అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ లో మాత్రం ప‌ట్టాలు పక్కగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. 

 

ఆగస్ట్ నాటికి కరోనా తగ్గే అవకాశాలు లేవు అని... ఆగస్ట్ 15 న ఇవ్వడం సాధ్యం కాదు అని అందుకే సెప్టెంబర్ లో వైఎస్ వర్ధంతి నాడు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. మరి అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ఏంటీ అనేది చూడాలి. వాస్తవానికి ముందు చెప్పిన దాని ప్రకారం రేపు ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: